కృష్ణా జ‌లాల‌పై రాజీప‌డే ప్ర‌స‌క్తే లేదు- మంత్రి కేటీఆర్‌

116
minister ktr

మంత్రి కేటీఆర్ ఈరోజు నారాయణపేట జిల్లాలో పట్టణ ప్రగతిలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణా నదీ జలాల వివాదంపై స్పందించారు. కృష్ణా నదీ జలాల విషయంలో తాము ఎవరితోనూ రాజీపడబోమని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం తమకు రావాల్సిన నీటి కేటాయింపుల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో ఏపీతోనే కాదు, అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడుతామని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలే తమకు పరమావధి అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తాము అని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఉండ‌గా ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు అన్యాయం జ‌ర‌గ‌నివ్వ‌మ‌ని తేల్చిచెప్పారు. ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలోని ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గాన్ని స‌స్య‌శ్యామ‌లం చేసేందుకు కృషి చేస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు.