సీఎం జగన్‌ని కలిసిన అనిల్ కుంబ్లే..

184
jagan kumble

ఏపీ సీఎం జగన్‌ని కలిశారు టీమిండియా దిగ్గజ స్పిన్నర్, మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో జగన్‌ని కలిసిన కుంబ్లే…తన క్రికెట్ ప్రయాణానికి సంబంధించిన ఫ్రేమ్ ను అందించారు.

ఏపీలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు తన సహకారం అందిస్తానని అనిల్ కుంబ్లే సీఎం జగన్ తో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు క్రీడా పరికరాల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా ప్రయత్నించాలని సీఎం జగన్ కు ఆయన సలహా ఇచ్చారని సమాచారం. ఏపీలో క్రీడారంగం అభివృద్ధిపై చర్చించారు.