నిలకడగా దిలీప్ కుమార్ ఆరోగ్యం..

35
dilip

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్‌ ఆరోగ్యం మెరుగుపడుతుందని డాక్టర్లు వెల్లడించారు. సైరా .. దిలీప్ కుమార్ ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ..దేవుడి ద‌య వ‌ల‌న‌ ఆయ‌న ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. మేము ఇంకా ఆసుప‌త్రిలోనే ఉన్నాము. అత‌ని ఆరోగ్యం మెరుగు ప‌డి, త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధించండి అని సైరా అన్నారు.

శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు ఏర్ప‌డ‌డంతో దిలీప్ కుమార్ ముంబైలోని హిందుజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జూన్ 6న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడగా ఆసుపత్రిలో చేర్పించారు. దిలీప్ కుమార్ కు బిలటేరల్ ప్లూరల్ ఎఫ్యూజన్ ఉన్నట్టుగా గుర్తించిన డాక్టర్లు ఆయన ఊపిరితిత్తుల్లో సమస్యకు కారణమైన ఫ్లూయిడ్ ని తొలగించి జూన్ 11న డిశ్చార్జ్ చేశారు. మళ్ళీ అంతలోనే ఆయన శ్వాస సంబంధిత సమస్యతో రీసెంట్‌గా ఆసుపత్రిలో చేరారు.దీంతో దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై సైరా భాను అప్‌డేట్స్ ఇస్తూనే ఉన్నారు.