ఏపీలో జగన్ ప్రభంజనం… 50స్ధానాల్లో వైసిపి ముందజ

188
YS Jagan

ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠకు తెరలేపుతుంది. ఆంధ్ర ప్రదేశ్ ఫలితాల కోసం దేశం మొత్తం ఎదురచూస్తుంది. ఇక ఇప్పటివరకూ వెలువడ్డ ఫలితాలను చూసుకుంటే ఏపీలో వైసిపి గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లలో వైసిపి ముందంజలో ఉండగా…టీడీపీ అభ్యర్దులు వెనుకంజలో ఉన్నారు. మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి వైసిపి మొత్తం 50 స్ధానాల్లో లీడ్ లో ఉండగా.. టీడీపీ 20 స్ధానాల్లో లీడ్ లో ఉంది.

ఇక నెల్లూరులో చూసుకుంటే నెల్లూరు సిటి లో వైసిపి అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ ముందంజలో ఉన్నారు. నగరి లో వైసిపి అభ్యర్ధి రోజ ముందంజలో ఉన్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో వెనుకంజలో ఉన్నారు. కడప, పులివెందుల, మైదుకూరు, జమ్మలమడుగు, బద్వేల్ లో వైసిపి ముందంజలో ఉంది. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఆధిక్యంలో ఉన్నారు. నెల్లూరు రూరల్, కావలి, సూళ్లూరుపేట, సర్వేపల్లి నియోజకవర్గాల్లో వైసీపీ ఫ్యాను జోరు కొనసాగుతోంది.