గ్రీన్ ఛాలెంజ్..మొక్కలు నాటిన యాంకర్ శ్రీముఖి

613
srimukhi
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు విశేషమైన స్పందన వస్తోంది. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా నేడు మొక్కలు నాటారు ప్రముఖ యాంకర్ శ్రీముఖి. తన ఇంటి ఆవరణలో మూడు మొక్కలు నాటారు. అనంతరం మరో ముగ్గురికి మొక్కలు నాటాల్సిందిగా సవాల్ విసిరారు. బిగ్ బాస్ 3 ఫేం వితిక, జానీ మాస్టర్, యాంకర్ రష్మీ కి మొక్కలు నాటాల్సిందిగా కోరారు.

srimukhi new

ఈసందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ… రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా రాబోయే తరాలకు పునాది వేసినట్టు ఉంటుంది. ఇప్పటికే చెట్లు నాటకపోవడం వల్ల వాతావరణంలో మార్పులు ఏవిధంగా మారుతున్నాయో మనకందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని నా తరపున కోరుతున్నాను. అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి మంచి కార్యక్రమంను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ , ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -