ఒమిక్రాన్ మందు అని చెప్పలేదు: ఆనందయ్య

162
anandayya
- Advertisement -

తనకు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ ఇచ్చిన నోటీసులపై స్పందించారు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య. తాను ఒమిక్రాన్‌ కోసం మందు అని చెప్పలేదన్నారు. అంతేకాకుండా తన మందు ఏ జబ్బుకైనా ఇమ్యూనిటిని మాత్రమే పెంచుతుందని ఆయన స్పష్టం చేశారు. జాయింట్‌ కలెక్టర్ నోటీస్‌కు పూర్తి వివరాలతో సమాధానమిస్తానని ఆయన వెల్లడించారు. ఉచితంగానే మందు ఇస్తున్నానని, తనపై గ్రామపంచాయతీలో తీర్మనం చేయడం బాధకరమని ఆయన అన్నారు.

ఒమిక్రాన్‌కు మందు ఇస్తానని ఆనందయ్య ప్రకటించడంతో పెద్ద ఎత్తున ఇతర గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో వెంటనే జాయింట్ కలెక్టర్…ఆనందయ్యకు హెల్త్ నోటీసు జారీ చేయ్యాలని ముత్తుకూరు మండల తహసీల్దార్ ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముత్తుకూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, సిబ్బంది సమక్షంలో తహసిల్దార్ సోమ్లా నాయక్ ఆనందయ్య కు నోటీసు డ్రగ్స్ అండ్ మాజిక్ రెమిడీస్ యాక్ట్ 1954, మరియు డిశాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ 2005 ప్రకారం మీవద్ద ఎటువంటి అనుమతులు లేని ఎడల మీరు పై మందు గురించి ప్రచారం కానీ పంపిణీ కానీ చేయడానికి అనర్హులు అని ఒమిక్రాన్ కు మందు తయారు చేశామని, 48 గంటల్లో ఒమిక్రాన్ వ్యాధి ని తగ్గిస్తామని ప్రకటన పై అనుమతులు లేని ఎడల పై తెలిపిన చట్టాల ప్రకారం మీ పైన తగు చర్యలు తీసుకొనుబడునని హెచ్చరిక జారీ చేస్తూ 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆయన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే స్పందించారు ఆనందయ్య.

- Advertisement -