ఓటీటీలో నాని శ్యామ్ సింగ రాయ్..!

32
nani

న్యాచులర్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగ రాయ్. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొంది భారీ వసూళ్లను రాబట్టింది.

జనవరి చివరి వారం నుండి ‘శ్యామ్ సింగ రాయ్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జనవరి 4వ వారం సినిమా డిజిటల్ గా ప్రసారం అవుతుందని ప్రచారం జరుగుతున్న ‘శ్యామ్ సింగ రాయ్’ ఓటిటి విడుదల తేదీని నెట్‌ఫ్లిక్స్ త్వరలో ప్రకటించనుంది.

నాని ఇందులో ద్విపాత్రాభినయం చేయగా, సాయి పల్లవి, కృతి శెట్టి ఇందులో హీరోయిన్లుగా నటించారు.