మాస్టర్ ఔట్…కెప్టెన్‌గా మెహబూబ్!

177
amma rajashekar
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4…9వ ఎలిమినేషన్‌లో భాగంగా అంతా ఊహించినట్లే జరిగింది. గత వారం ఎలిమినేషన్ నుండి తప్పించుకున్న అమ్మా రాజశేఖర్ మాస్టర్ ఈ వారం మాత్రం ఎలిమినేట్ కాక తప్పలేదు. కెప్టెన్‌గా ఉన్నా ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉండటంతో ఎలిమినేషన్ నుండి తప్పించుకోలేక పోయారు మాస్టర్‌.

తొమ్మిదో వారం ఎలిమినేషన్‌కు అభిజిత్, హారిక, మోనాల్, అమ్మ రాజశేఖర్, అవినాష్ నామినేట్ అయ్యారు. వీళ్లలో శనివారం నాటి ఎపిసోడ్‌లో హారిక సేవ్ అయ్యింది. తర్వాత ఒక్కొక్కరుగా అభిజిత్, మోనాల్ సేవ్ కాగా చివరగా మాస్టర్‌, అవినాష్‌ మిగిలారు. కాసేపు సస్పెన్స్ అనంతరం మాస్టర్‌ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించి ఆయన్ని స్టేజ్ పైకి ఆహ్వానించారు నాగార్జున.

ఇక బయటకు వచ్చిన మాస్టర్‌తో గేమ్‌ ఆడించాడు నాగార్జున. సోహైల్‌, లాస్య‌, అరియానా, మోనాల్, మెహ‌బూబ్, అవినాష్ అస‌లు అని, అఖిల్‌ను హీరో అంటూ, అభిజిత్‌ను విల‌న్ చేయడంతో పాటు హారిక కూడా నకిలీ మ‌నుషులు అని తేల్చి చెప్పాడు.

- Advertisement -