బిగ్ బాస్ …ఎపిసోడ్ 64 హైలైట్స్

156
anchor suma
- Advertisement -

బుల్లి తెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 64 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 64వ ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి నుండి అమ్మా రాజశేఖర్ ఎలిమినేట్ కావడం,సుమ వైల్డ్ కార్డు ఎంట్రీ ట్వీస్ట్, సండే ఫన్ డే వంటి టాస్క్‌లతో ముగిసింది.

తొలుత దీపావళి సందర్భంగా ఇంటి సభ్యులకు గిఫ్ట్స్ వచ్చాయని వాటిని తీసుకోవాలంటే కొన్ని ఛాలెంజ్‌లు పూర్తి చేయాలని తెలిపారు నాగార్జునమొద‌ట‌ సోహైల్ కోసం మెహ‌బూబ్ నేల మీద బౌల్‌లో ఉన్న‌ బిస్కెట్ల‌ను చేయితో ప‌ట్టుకోకుండా తినేశాడు. దీంతో సోహైల్‌కు త‌ను పంపిన బ్రేస్‌లెట్ గిఫ్ట్‌ను మెహ‌బూబ్ తొడిగాడు.

త‌ర్వాత అఖిల్ కోసం అభిజిత్.. త‌ల మీద బుట్ట‌లో బంతులు వేసే ఆట ఆడాడు. దీంతో అఖిల్ గిఫ్ట్ ఓపెన్ చేయ‌గా మోనాల్ పంపించిన చాక్లెట్లు క‌నిపించాయి. అనంత‌రం అభిజిత్ కోసం అఖిల్‌ సోడాబుడ్డి క‌ళ్ళ‌ద్దాలు పెట్టుకుని బంతులు వేరు చేసే గేమ్ ఆడాడు. కానీ విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో అభికి వ‌చ్చిన గిఫ్ట్ వెన‌క్కు వెళ్లిపోయింది. లాస్య కోసం హారిక ఆడగా అందులో లాస్య ఓడిపోయింది. ఇక మెహబూబ్ కోసం అవినాష్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్ జ‌డ వేయించుకున్నారు. దీంతో మెహ‌బూబ్‌కు సోహైల్ కాఫీ క‌ప్పును అందించాడు.

త‌ర్వాత అవినాష్ కోసం మాస్ట‌ర్, అరియానా కోసం మెహ‌బూబ్ గేమ్ ఆడారు. కానీ వీరిద్దరూ ఓడిపోయారు. చివరగా హారిక కోసం.. అభిజిత్, లాస్య‌ బంతుల టాస్కు ఆడి గెలిచారు. హారిక‌కు అభి నువ్వుండ‌లు, లాస్య డ్రెస్ పంపించింది. మిగిలిన‌ మోనాల్‌, అమ్మ రాశేఖ‌ర్‌కు ఎవ‌రూ గిఫ్టులు పంప‌కపోవ‌డంతో తానిస్తాన‌ని నాగ్ స్వ‌యంగా ముందుకొచ్చారు. మాస్ట‌ర్‌కు చేప‌ల కూర‌, మోనాల్‌కు అహ్మ‌దాబాద్ నుంచి స్వీట్లు తెప్పించారు.

ఇక తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ సర్‌ ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్‌. సుమ సూప‌ర్‌ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని ఆహ్వానించి కాసేప్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తర్వాత ఇంటి సభ్యులు ఒక్కొక్కరితో తనదైన స్టైల్‌ ఆడుకున్నారు సుమ. మోనాల్‌ ఎప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటుంది కాబట్టి టిష్యూలు, అరియానాకు లాలీపాప్‌,లాస్య‌కు తెలుగు జోక్స్ పుస్త‌కం తెచ్చింది హారిక‌తో తెలుగు టంగ్ ట్విస్ట‌ర్‌, అవినాష్‌తో ఇంగ్లీష్ టంగ్ ట్విస్ట‌ర్ చెప్పించేందుకు ప్ర‌య‌త్నించి నవ్వులు పూయించింది.

త‌ర్వాత‌ అవినాష్‌కు బిస్కెట్లు, మాస్ట‌ర్‌కు ఫ‌స్ట్ ఎయిడ్ కిట్ తెచ్చాన‌ని చెప్తూ, అఖిల్‌కు ల‌వ్ లెట‌ర్ రాసేందుకు పెన్నూ పేప‌ర్ తేవ‌డం మ‌ర్చిపోయిన‌ట్లు తెలిపింది. ఇక చివరగా ట్విస్ట్ ఇస్తూ హౌస్‌లోకి వెళ్ల‌మ‌న‌గానే గంగ‌వ్వ వ‌య‌సొచ్చాక వెళ్తానంటూ షో నుంచి జారుకుంది. అనంత‌రం ఎలిమినేషన్‌ ప్రక్రియలో చివరగా మిగిలిన అవినాష్‌,అమ్మా రాజశేఖర్ మాస్టర్‌ ఇద్దరిని డేంజర్‌ జోన్‌లో పెడుతూ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఈ క్రమంలో అరియానా ఎమోషనల్ అవుతూ అవినాష్‌తో ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని హితబోధ చేసింది.

అమ్మ రాజ‌శేఖ‌ర్‌ ఎలిమినేట్ అవ‌గా అత‌నితో గేమ్‌ ఆడించాడు. సోహైల్‌, లాస్య‌, అరియానా, మోనాల్, మెహ‌బూబ్, అవినాష్ అస‌లు అని, అఖిల్‌ను హీరో అంటూ, అభిజిత్‌ను విల‌న్ చేస్తూ హారిక కూడా నకిలీ మ‌నుషులు అని తేల్చి చెప్పాడు. దీంతో ఎపిసోడ్ ముగిసింది.

- Advertisement -