సుమ సూపర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. !

39
suma

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 64 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 64వ ఎపిసోడ్‌లో భాగంగా ప్రేక్షకులతో పాటు ఇంటి సభ్యులకు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్. సూపర్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరొకరు హౌస్‌లోకి రాబోతున్నారని ఇంటి సభ్యులు ముఖ్యంగా ఆడవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు నాగ్‌. దీంతో అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా యాంకర్ సుమ అదిరిపోయే ఎంట్రీ ఇవ్వగా ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులు థ్రిల్‌ అయ్యారు.

సండేను ఫన్‌ డే మారుస్తూ నాగార్జునతో కలిసి ఎంటర్‌ టైన్ చేసింది సుమ. మోనాల్‌ ఎప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటుంది కాబట్టి టిష్యూలు, అరియానాకు లాలీపాప్‌, లాస్య‌కు తెలుగు జోక్స్ పుస్త‌కం తెచ్చింది హారిక‌తో తెలుగు టంగ్ ట్విస్ట‌ర్‌, అవినాష్‌తో ఇంగ్లీష్ టంగ్ ట్విస్ట‌ర్ చెప్పించేందుకు ప్ర‌య‌త్నించి నవ్వులు పూయించింది. త‌ర్వాత‌ అవినాష్‌కు బిస్కెట్లు, మాస్ట‌ర్‌కు ఫ‌స్ట్ ఎయిడ్ కిట్ తెచ్చాన‌ని చెప్తూ, అఖిల్‌కు ల‌వ్ లెట‌ర్ రాసేందుకు పెన్నూ పేప‌ర్ తేవ‌డం మ‌ర్చిపోయిన‌ట్లు తెలిపింది.

ఇక చివరగా ఇంట్లోకి వెళ్లమని నాగ్ కోరగా ..చిన్న ప్రాబ్లమ్ వచ్చింది సార్. జస్ట్ ఎంటర్ అవుదామని అనుకున్న సమయంలో.. వైల్డ్ డాగ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, ఆచార్య, ఆర్ఆర్ఆర్ వీటన్నింటికీ సంబంధించి ప్రెస్ మీట్‌లు, ప్రీ రిలీజ్‌లు స్టార్ట్ కాబోతున్నాయని…అవన్నీ వదులుకొని వెళ్లలేను సార్ అందుకే బిగ్ బాస్‌ హౌస్‌లోకి వెళ్లను అంటూ నాగ్‌తో చెప్పుకొచ్చింది. వెళ్తాను కానీ, ఇప్పుడు కాదు సార్. గంగవ్వ వయసు రాగానే వెళ్లిపోతాను లోపలికి అంటూ అందరినీ నవ్వించి ఇంటికి వెళ్లిపోయారు సుమ.