అమిత్ షా తాగే వాటర్ బాటిల్ ధరెంతో తెలుసా?

23
shah

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తాగే వాటర్ బాటిల్ ధరెంతో తెలుసా.? అక్షరాల రూ. 850. ఇది నిజం ఈ విషయాన్ని బయటపెట్టింది బీజేపీ నేతే. గోవా మంత్రి రవినాయక్ అమిత్ షా తాగే నీళ్ల బాటిల్ ధర రూ. 850 అని వెల్లడించారు. గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో షా తాగిన బాటిల్ ధర చెప్పి షాకిచ్చారు.

గోవాలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ప్రచారం కోసం వచ్చినప్పుడు హిమాలయ బ్రాండ్‌ నీళ్లు కావాలని షా అడిగారు. పనాజీ నుంచి 10 కిలోమీటర్ల దూరం నుంచి ఆ నీళ్ల బాటిళ్లను తెప్పించాం అన్నారు. సాధారణ బాటిలే స్టార్‌ హోటళ్లలోనూ ఒక్కో నీళ్ల బాటిల్‌ ధర రూ.150-160 ఉంటుందని తెలిపారు.