షాకింగ్..మాజీ క్రికెటర్ సైమండ్స్ మృతి

25

క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, దిగ్గజ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. క్వీన్స్‌లాండ్‌లోని టౌన్‌విల్లేలో శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కొల్పోయాడు.

వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో సైమండ్స్ మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. సైమండ్స్‌ మృతితో క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. సైమండ్స్‌ మరణం పట్ల ఐసీసీ సంతాపం తెలిపింది.

రెండు ప్రపంచ కప్‌లు (2003, 2007 వన్డే వరల్డ్‌ కప్‌) సాధించిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్న సైమండ్స్‌.. 1998లో పాకిస్థాన్‌పై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ఐపీఎల్‌లో సైతం రాణించారు సైమండ్స్.