అమెరికాలో తెలుగు స్టూడెంట్స్ కష్టాలు..

133
America Problems By Telugu Ammai

అమెరికా అదో భూతల స్వర్గం.. యూఎస్ వెళ్లాడం ఇండియాలో చాలా మందికి పెద్ద డ్రీం. అందుకే చదువుకో..ఉద్యోగానికో అక్కడ ఒక్కసారి అడుగుపెడితే చాలు జీవితంలో స్థిరపడ్డట్లే అని చాలామంది అనుకుంటారు. అందమైన జీవితాన్ని ఉహించుకుని..ఎన్నో ఆశల రెక్కలతో వాలిపోతారు. తీర అక్కడికెళితే సీన్ మొత్తం రివర్స్. ఇక్కడ ప్రతిపనికి డిగ్నిటీ అంటూ ఫోజులు కొట్టేవారు అమెరికాలో చేసే పని గురించి తెలిస్తే షాకవ్వకమానరు.

ఇదే విషయాన్ని ఓ అమ్మాయి…అమెరికాలో తామెలాంటి కష్టాలు అనుభవిస్తున్నామో పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చింది. ఇక్కడికొచ్చిన అందరు పాష్‌గా తయరయ్యి ఇండ్లలో పాచీ పనులు చేస్తారు. ఇంటి కొస్తారు తింటారు పడుకుంటారు. ఇక్కడ ఇళ్లు చాలా కాస్ట్లీ అంతా రెంటు పెట్టి ఉండలేక 10మంది కలిసి ఒకే రూమ్‌లో ఉంటారు. ఇంకా ఆమె వింత అనుభవాలేంటో ఆమె మాటల్లోనే..