అమెరికాలో డెల్టా పంజా..

58
delta

అమెరికాలో మళ్లీ డెల్టా వైరస్ కేసులు తీవ్రస్ధాయికి చేరాయి. సోమవారం ఒక్కరోజే లక్షకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ప్రతిరోజు 1800 మందికి పైగా మరణిస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో డెల్టా వేరియంట్ తీవ్ర స్ధాయికి చేరుతుందని…ఎవరూ నిర్లక్ష్యంగా ఉండరాదని నిపుణులు హెచ్చరించారు.

తీవ్ర‌మైన కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో ఇంకా ల‌క్ష‌లాది మంది హాస్పిట‌ళ్ల‌లో చికిత్స పొందుతున్నారు. జాన్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెష‌ర్ భ‌క్తి హ‌న్సోటి అమెరికాపై రిపోర్ట్ ఇచ్చారు. ఇండియా త‌ర‌హాలోనే అమెరికాలో కూడా డెల్టా త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని ప్రొఫెష‌ర్ హ‌న్సోటి తెలిపారు. ప‌శ్చిమ యూరోప్ దేశాల్లోనూ ఇదే ర‌క‌మైన ట్రెండ్ కొన‌సాగుతున్న‌ట్లు చెప్పారు.