దేశంలో 24 గంటల్లో 27,176 కరోనా కేసులు..

41
coronavirus

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 27,176 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 284 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,33,16,755కు చేరింది.

కరోనా నుండి 3,25,22,171 మంది కోలుకోగా 4,43,497 మంది బాధితులు కరోనాతో మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 3,51,087 యాక్టివ్ కేసులుండగా ఇప్పటివకు 75,89,12,277 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్య,ఆరోగ్య శాఖ తెలిపింది.