అగ్రరాజ్యంలో తగ్గుముఖం పట్టిన కరోనా..!

58
america

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా తగ్గుముఖం పడుతోంది. ఇప్పటికే వ్యాక్సినేషన్ దాదాపు పూర్తి కావడంతో మాస్క్ ఫ్రీగా ప్రకటించింది బైడెన్ సర్కార్. ఒకప్పుడు లక్షల్లో కేసులు..వేలల్లో మరణాలు సంభవించగా ప్రస్తుతం మరణాలు 600కు పడిపోయాయి, సగానికిపైగా రాష్ట్రాల్లో మరణాలు జీరోకు చేరగా.. మరికొన్ని రాష్ట్రాల్లో రెండంకెల కంటే దిగువకు చేరాయి.

ప్రస్తుతం అమెరికాలో వేగంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలో వైరస్‌ కాస్త తగ్గుముఖం పడుతోంది. 75 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తవగా.. 58శాతం మందికిపైగా కనీసం ఒక మోతాదును తీసుకున్నారు. ఈ వారంలో ఫైజర్‌ కంపెనీ 12-15 ఏళ్ల మధ్య పిల్లలకు వ్యాక్సిన్‌ వేసేందుకు ఎఫ్‌డీఏ అనుమతి పొందడంతో తిరిగి పాఠశాలలు ప్రారంభించే పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్నారు.