అమెరికాలో ఒక్కరోజే 2వేల మంది మృతి..

82
delta

అమెరికాలో కరోనా కేసుల సంఖ్య, మృతుల మళ్లీ పెరిగిపోతున్నాయి. గత వారం రోజులుగా కరోనా మరణాల సంఖ్య 2 వేలకు పైగా నమోదవుతుండగా అత్యధికంగా ఫ్లోరిడా, టెక్సాస్‌, క్యాలిఫోర్నియా రాష్ట్రాల్లో అత్య‌ధికంగా మ‌ర‌ణాలు, కేసులు న‌మోద‌వుతున్న‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి.

ఇక అమెరికాలో న‌మోద‌వుతున్న కేసుల్లో అత్య‌ధికంగా డెల్టా వేరియంట్ కేసులే అని, ప్ర‌జ‌లు మ‌రికొంత‌కాలం పాటు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సీడీసీ వెల్ల‌డించింది. అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు 54 శాతం మంది రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోగా, 66 శాతం మంది మొద‌టి డోసు తీసుకున్నారు.