ఆయనంటే ఎంతో ఇష్టం: బన్నీ

44
bunny

అక్కినేని సమంత హోస్ట్‌గా సామ్ జామ్ షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు ఈ కార్యక్రమంలో సందడి చేయగా తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సమంతతో కలిసి సందడి చేశారు. ఇప్పటికే పలు ప్రొమోల ద్వారా ఎపిసోడ్‌పై అంచనాలను పెంచేయగా అంచనాలను తగ్గట్టుగానే తన మనసులోని మాటలను బయట పెట్టారు బన్నీ.

తండ్రయ్యాక తాను ఇంట్లో బూతులు మాట్లాడటం తగ్గించానని తెలిపారు. నేను మా నాన్నంత గొప్పవాడిని ఎప్పటికీ అవ్వలేను. ఆయనలో సగం కూడా కాలేను. ఈ ప్రపంచంలోకెల్లా ఆయనంటే నాకెంతో ఇష్టం అని తెలిపారు బన్నీ.

ఇక అరవింద్ సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చి బన్నీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బన్నీ హార్డ్ వర్కింగ్,క్రమశిక్షణగా ఉంటున్నారు..చిన్నపుడు అలా కాదని దండం పెట్టారు అరవింద్.