మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య ఇకలేరు..

29
katta

మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య (87) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మధిర శాసనసభ స్థానం నుంచి రెండుసార్లు సీపీఎం ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహించారు.


2009 శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీ అవలంభించిన విధానాలు, రాష్ట్ర అగ్రనాయకత్వం తీరు నచ్చక పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి ( నెలలో గడువు ముగుస్తుందనగా) రాజీనామా చేశారు. చనిపోయేంత వరకు పార్టీ సిద్ధాంతలకు కట్టుబడి పనిచేశారు. యుక్త వయసు నుంచి వెంకటనర్సయ్య రాజకీయాల్లో ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సీపీఎం జిల్లా నాయకులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.