తలైవి..ఎంజీఆర్ లుక్‌లో అరవింద్ స్వామి!

39
mgr

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం తలైవి. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నారు.

జ‌య‌ల‌లిత‌ సినీ, రాజకీయ జీవితంలో కీల‌క పాత్ర పోషించిన‌ ఎం.జి.రామచంద్రన్ (మక్కల్‌ తిలగమ్) పాత్ర‌లో ప్ర‌ముఖ నటుడు అరవింద్ స్వామి కీలకపాత్ర పోషించారు. ఈ సందర్భంగా అరవింద్ స్వామి లుక్‌ రివీల్ చేశారు నిర్వాహకులు.

ఎంజీఆర్ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఇవాళ ఉద‌యం 10 గంట‌ల‌కు త‌లైవి నుంచి న్యూ లుక్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు అర‌వింద్ స్వామి ట్వీట్ చేశాడు. ఈ మూవీలో కరుణానిధి పాత్రలో ప్రకాష్‌రాజ్‌ నటిస్తున్నారు.