ఆ హీరో అంటే ఇష్టం- అలియా భట్‌

359

టాలీవుడ్‌ హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా స్టార్ స్టేటస్ సంపాదించాడు. అంతేకాక విజయ్ స్టైల్‌కు అందరూ అతన్ని ముద్దుగా ‘రౌడీ’ అని పిలుచుకుంటారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్లను పక్క ఇండస్ట్రీ వాళ్ళు అసలు పట్టించుకోరన్న సంగతి తెలిసిందే. అయితే విజయ్‌ను మాత్రం అనేక సందర్భాల్లో కోలీవుడ్‌,బాలీవుడ్‌ నటీనటులు పొగిడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతేకాదు ఈ హీరో అంటే బాలీవుడ్ బ్యూటీలు ఎంతో ఇష్టపడుతున్నారు.

vijay

గతంలో హీరోయిన్ జాన్వీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో విజయ్ పేరు ప్రస్తావించడం విశేషం. అలాగే ‘కబీర్ సింగ్’ హీరోయిన్ కియారా అద్వానీ కూడా పలుసార్లు విజయ్ నటనపై ప్రశంసలు కురిపించింది. ఇక తాజాగా ఇదే కోవలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా విజయ్ దేవరకొండను పొగడటం బాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ఇటీవల ముంబైలో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అలియా భట్‌ హాజరైంది.

అలియా భట్‌ మహిళల విభాగంలో మోస్ట్‌ స్టైలిష్‌ స్టార్‌గా అవార్డు కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఇష్టమైన స్టైలిష్‌ స్టార్‌ల పేర్లు వెల్లడించింది. అమితాబ్‌ బచ్చన్‌తో పాటు విజయ్‌ దేవరకొండ అని చెప్పుకొచ్చింది. విజయ్‌ స్టైల్‌ అద్భుతంగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో రామ్‌చరణ్‌ సరసన నటిస్తుంది.

Alia Bhatt Says I Like Vijay Devarakonda Style At Filmfare Glamour Style Awards 2019 In Mumbai..Alia Bhatt Says I Like Vijay Devarakonda Style..