ఎంపీ సంతోష్ బర్త్ డే…మొక్కతో సెల్ఫీ

416
mp santhosh kumar

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌ ఉద్యమంలా సాగుతోంది. తాను ఒక మొక్కను నాటి మరో ముగ్గురికి మొక్కలు నాటాలని సూచించారు. ఈ బృహత్తర కార్యక్రమానికి విశేషస్పందన వచ్చింది. సినీ,క్రీడా,రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రమంత్రులు సైతం గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఇప్పటివరకు 4.5 కోట్లకు పైగా మొక్కలు నాటారు.

ఇక ఈ కార్యక్రమంలో ప్రజలను మరింత భాగస్వాములను చేయడంలో భాగంగా తన బర్త్‌ డేకి మొక్కలు నాటి ఆ సెల్ఫీని గిఫ్ట్‌గా ఇవ్వాలని కోరారు ఎంపీ సంతోష్. #SelfieWithSaplingOnJSKBirthday అనే హ్యాష్ ట్యాగ్‌ను షేర్ చేశారు.

తనకు బహుమతి ఇవ్వాలనుకునే వారు ట్విట్టర్,ఫేస్ బుక్‌,వాట్సాప్ ద్వారా మొక్కతో సెల్ఫీ దిగిన ఫోటోను పంపాలని…మీరు పంపించిన సెల్ఫీలతో సోషల్ మీడియా నిండిపోయేలా చేస్తారని భావిస్తున్నానని చెప్పారు సంతోష్ కుమార్. ఇక ఈ నెల 7న పుట్టినరోజు జరుపుకోనున్నారు సంతోష్.

selfie with sapling on MP Santhosh Birthday..selfie with sapling on MP Santhosh Birthday..selfie with sapling on MP Santhosh Birthday

jsk