టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ – కమెడీయన్ అలీ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. పవన్ చేసే ప్రతి సినిమాలో అలీ తప్పకుండా ఉండాల్సిందే. ఈ విషయాన్ని పవనే స్వయంగా వెల్లడించారు. అయితే కొంతకాలంగా వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఈ నేపథ్యంలో జరిగిన అలీ కూతురు పెళ్లికి పవన్ హాజరుకాకపోవడంతో ఆ గ్యాప్ మరింత పెరిగిందని పుకార్లు షికార్ చేస్తున్నాయి.
దీంతో ఈ పుకార్లకు పుల్ స్టాప్ పెట్టారు అలీ. పవన్ కళ్యాణ్ గారికి శుభలేఖ ఇవ్వడం జరిగింది. అయన కూడా వివాహానికి వస్తాను అని చెప్పారు. ఆ క్రమంలోనే అయన సెక్యూరిటీ సిబ్బంది కూడా వచ్చి రూట్ మ్యాప్ చూసుకున్నారు. కానీ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడంతో అయన రాలేకపోయారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, అయన ఫోన్ లో మాట్లాడారు. వధూవరులు ఇద్దరు ఇంటిలో ఉన్నప్పుడు చెప్పు, నేను ఇంటికి వచ్చి కలుస్తా అని చెప్పారు అంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఇకనైన మరి ఈ పుకార్లకు బ్రేక్ పడుతుందా లేదా చూడాలి.
హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకకు ఏపీ సీఎం జగన్తో పాటు చిరంజీవి, నాగార్జున, అమల, రోజాలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. ఇక ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారుగా అలీ నియామకం అయిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..