ఎన్టీఆర్ చిత్రానికి ముహూర్తం కుదిరింది

110
- Advertisement -

ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా లాచింగ్ డేట్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 17వ తేదీన పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ముమ్మరంగా జరుగుతుంది. కొరటాల శివ క్యాస్టింగ్ ను కూడా ఫైనల్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ కి విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను తీసుకున్నారు. సంజయ్ కూడా ఎన్టీఆర్ కి విలన్ గా నటించడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. అలాగే యంగ్ హీరోయిన్ అనన్య పాండే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

మరోపక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొరటాల పై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ తో కొరటాల తన సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు ?, ఎప్పుడు క్లోజ్ చేస్తాడు ? అని ఎన్టీఆర్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి వారి ఎదురు చూపులకు డిసెంబర్ 17న సమాధానం దొరకనుంది. ఇక పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమా ద్వారా కొరటాల శివ తన కెరీర్‌లో తొలిసారి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అన్నట్లు ప్రస్తుతం ఈ సినిమా టీమ్ హీరోయిన్ పాత్ర కోసం కూడా వెతుకుతుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -