‘అల వైకుంఠపురములో’ మరో రికార్డు..!

322
allu arjun

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన అల వైకుంఠపురములో చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లో ఈ మద్య కాలంలో ఇంత భారీ హిట్‌ పడలేదనే చెప్పాలి. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఈ మూవీ పలు రికార్డులు కూడా క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ మరో రికార్డును అందుకుంది.

Ala Vaikunthapurramloo

తాజాగా ఈ సినిమాను సన్‌ నెక్ట్స్‌లో నిన్నటి నుంచి ప్రీమియర్ చేస్తామని ప్రకటించినా.. ముందుగా ప్రసారం చేయలేదు. ఆ తర్వాత ఏమైందో ఏమో అర్థరాత్రి ఈ సినిమాను సన్‌ నెక్ట్స్‌ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో పెట్టేసారు. అంతేకాదు ఈ సినిమాను సన్ నెక్ట్స్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌తో పాటు మరో డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ నెటిఫ్లిక్స్‌లో కూడా ప్రదర్శితమవుతోంది. ఈ రకంగా రెండు మేజర్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రదర్శితమవుతున్న తొలి సినిమాగా ‘అల వైకుంఠపురుములో’ సినిమా రికార్డులకు ఎక్కింది.