గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ప్రముఖ సినీ నటులు..

330

వాయు వేగంతో దేశం లోని నలుదిక్కులా వ్యాపిస్తున్న..రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్ వనస్థలి పురంలో పలువురు సినీ కళాకారులు మొక్కలు నాటారు. ఇందులో తులసి,వై.విజయ,జూనియర్ రేలంగి ,శశాంక ,గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధి కాదంబరి కిరణ్,కిశోర్ దాస్. దర్శకుడు రామక్తిష్ణ, కెమెరామాన్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Green Challenge

ఈ సందర్భంగా సీనియర్ నటి తులసి మాట్లాడుతూ “నాకు చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ కోసం మేము హైదరాబాద్ కి వచ్చాము .ఇక్కడ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్,మమ్మల్ని మొక్కలు నాటాలని కోరడం చాలా ఆనందంగా,సంతోషంగా ఉంది. దయచేసి అందరు కూడా మొక్కలు నాటండి. బర్త్ డే,మ్యారేజ్ డేల సందర్భంగా రకరకాల బహుమతులు కాకుండా ఇలా మొక్కలు నాటించాలని,వాటిని సంరక్షించే బాధ్యత కూడా అందరూ తీసుకోవాలని కోరారు.ఇంత గొప్ప కార్యక్రమాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కి వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.