పట్టణాలను అభివృద్ధి చేసుకుందాం: సైదిరెడ్డి

109
mla saidireddy

పట్టణాలను అభివృద్ధి చేసుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల అభివృద్ధి జరిగిందని పట్టణ ప్రగతితో పట్టణాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇవాళ హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 18, 19వ వార్డుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.