అయ్యప్ప మాలలో అఖిల్

225
akhil

ఎప్పుడూ షూటింగ్ లతో బిజీగా ఉండే లాక్ డౌన్ కారణంగా సినీ ప్రముఖులు లాక్ డౌన్ కారణంగా తమ కుటుంబ సభ్యులతో గడిపారు. పలువురు సెలబ్రెటీలు తాము చేసిన పనులను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా యువ హీరో అక్కినేని అక్కిల్ అయ్యప్ప స్వామి మాల వేశారు. సిటికి దూరంగా అయ్యప్ప దీక్షలో బిజీగా ఉన్నారట అఖిల్. హైదరాబాద్ లో కరోనా కేసులు ఎక్కువ వస్తుండటంతో షాద్ నగర్ లో ఫాం హౌస్ లో అఖిల్ దీక్షలో ఉన్నట్లు సమాచారం. టాలీవుడ్ హీరోలు నితిన్, రామ్ చరణ్, శర్వానంద్ లు కూడా ప్రతి ఏడాది అయ్యప్ప స్వామి మాలను ధరిస్తారు.

కాగా అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈమూవీకి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈమూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ లేకుంటే ఈసినిమాను మే నెలలో విడుదల చేసేవారు. ప్రస్తుతం థియేటర్లు మూసి ఉండటంతో ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం కానుంది.