న్యూయార్క్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌..

298
akhil
- Advertisement -

కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్ ….బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే టైటిల్ ఖరారు చేయగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడగా ఇటీవలె తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం న్యూయార్క్‌లో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఫోటోను షేర్ చేసిన అఖిల్‌…నిజంగానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా కనిపిస్తున్నారు.

అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు అఖిల్‌ కూడా ఈ సినిమా హిట్‌పై కాన్ఫిడెంట్‌తో ఉన్నారు.

- Advertisement -