సమంత కోసం స్టెప్పులేసిన అఖిల్‌..

344
- Advertisement -

సౌత్‌లో టాప్ హీరోయిన్‌ల‌లో ఒకరిగా దుసుకుపోతుంది స‌మంత. తాజాగా ఆమె న‌టించిన యూట‌ర్న్ చిత్రం సెప్టెంబ‌ర్ 13న తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల కానుంది. క‌న్న‌డ రీమేక్‌గా ప‌వ‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇటీవ‌ల చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా అనిరుధ్ స్వ‌ర‌ప‌రచిన క‌ర్మ థీమ్ అనే స్పెష‌ల్ సాంగ్ విడుద‌ల చేశారు.

ఈ సాంగ్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వ‌స్తుంది. అయితే మొన్నటివరకు ‘కికి’, ‘హరిత హారం’, ‘హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌’ ఛాలెంజ్‌లు సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండ్‌ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఛాలెంజ్‌ నెట్టింట్లో హల్‌చల్‌ సృష్టిస్తోంది. దాని పేరే ‘యూ టర్న్‌’ ఛాలెంజ్.

Akkineni Akhil

ఇక ఈ సాంగ్‌లో సమంత చేతులు, కాళ్లు ఒకేసారి కదుపుతూ చేసే డ్యాన్స్‌ స్టెప్‌ ఒకటి ఉంది. ఈ స్టెప్‌ను సమంత చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అభిమానులు కూడా ఈ డ్యాన్స్‌ చేసి తనకు వీడియో పంపాలని కోరారు. అయితే ఈ పాటకు యువకథానాయకుడు అక్కినేని అఖిల్‌ డ్యాన్స్‌ చేసి తన డ్యాన్స్‌ వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ‘ఈ వీడియో మా వదిన కోసం..’ అని క్యాప్షన్‌ కూడా పెట్టాడు. ఈ హీరో తోపాటు పిల్ల‌లు, పెద్దలు అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్కరు ఈ సాంగ్‌లో స‌మంత స్టెప్పుల‌ని అనుక‌రిస్తూ డ్యాన్స్‌లు చేసి వీడియోల‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

- Advertisement -