బాబుగా మారిన భల్లాలదేవ..!

391
Yes it is young Chandrababu-Rana
- Advertisement -

టవర్‌స్టార్‌ రానా..ఇప్పుడు నారాగా మారాడు. ‘ఘాజీ’లో ఖాకీ డ్రెస్‌ తో సరదా తీర్చుకున్న రానా.. కద్దర్ డ్రెస్‌తో కనిపిస్తున్నాడు. భారీ దేహంతో భల్లాలదేవాగా మెప్పించిన రానా ఎన్టీఆర్‌ బయోపిక్‌ లోయంగ్‌ చంద్రబాబుగా కనిపించనున్నాడు. ఎన్టీఆర్‌ జీవితనేపథ్యం ఆధారంగా తీస్తున్న ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ పాత్రలో నటసింహం బాలకృష్ణ నటిస్తుండగా..నారా చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా ఫిక్స్‌ అయ్యాడు. తాజాగా ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో కనిపించే రానా లుక్‌ సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తోంది. వైట్‌ అండ్‌ వైట్‌ డ్రెస్‌లో రానా లుక్ కి ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు.

రానా ఇప్పుడు క్లీన్ షేవ్ తో మీసాలు పెంచి బాబు గెటప్ లో ఒదిగిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. వికారాబాద్ రైల్వే స్టేషన్ లో గత రెండు రోజులుగా చిత్ర షూటింగ్ జరుగుతుండగా, రానా కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఇందులో రానాని చూస్తుంటే ఆయన పూర్తిగా చంద్రబాబు పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుగా అనిపిస్తుంది. మరి వెండితెరపై చంద్రబాబుగా రానా ఏ రేంజ్ లో అదరగొడతాడో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఈ సినిమా లో క్రిష్ ఏ పాత్ర అయినా పాత వారిని గుర్తుకు రాకుండా చేసే ప్రయత్నమేదో బాగా మొదలెట్టినట్టుగాకనబడుతున్నాడు. ఇక ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నారు.

- Advertisement -