మళ్లీ ఆస్పత్రిలో సమంత!

18
- Advertisement -

నటి సమంత మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సామ్.. . ఆసుపత్రిలో సమంత బెడ్‌పై పడుకుని సెలైన్ ఎక్కించుకుంటుండగా తీసిన ఫొటో ను షేర్ చేశారు. ఒక్కసారిగా ఆసుపత్రిలో సమంత కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ కంగారు పడ్డారు.

తమ అభిమాన నటికి ఏమైంది అన్న కామెంట్స్ చేస్తున్నారు. ఇక చాలాకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతోంది సమంత. దాని నుంచి బయటపడడానికి చికిత్స తీసుకుంటోంది. ఇక ఇటీవలె మయోసైటిస్ నుండి కొలుకుని ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అలాగే ఇప్పుడు రక్త బ్రహ్మాండ్ మూవీలో నటిస్తోండగా ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ పేరుతో సొంత నిర్మాణ సంస్థను లాంచ్ చేసిన విషయం విదితమే.

Also Read:ఏఆర్ రెహమాన్‌కు అస్వస్థత..

- Advertisement -