‘నోటా’ రిలీజ్‌కి డేట్‌ ఫిక్సైంది..

199
Vijay Deverakonda NOTA
- Advertisement -

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ ‘నోటా’ మూవీతో తన రౌడీస్‌లో మళ్ళీ జోష్‌ పెంచేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఆనంద్‌ శంఖర్‌ దర్శకత్వంలో వస్తున్న’నోటా’ మూవీ తెలుగుతో పాటు తమిళ బాషలోనూ రానుంది.

విజయ్ కి జోడీగా..మెహ్రీన్‌ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజై సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఈ క్రమంలోనే చిత్రటీమ్‌ నోటా రిలీజ్‌ కి డేట్ ని కూడా ఫిక్స్‌ చేసింది. అక్టోబర్ 4వ తేదీన నోటాను రిలీజ్‌ చెయ్యాలని దర్శక నిర్మాతలు డైసైడయ్యారు. దసరా రోజుల్లో తెలుగు .. తమిళ భాషల్లో గట్టిపోటీనే వుంది. అందువలన కాస్త ముందుగానే ఈ సినిమాను విడుదల చేయడం మంచిదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఒక సాధారణ యువకుడిగా .. ముఖ్యమంత్రిగా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న విజయ్‌ రౌడీస్‌.. విజయ్ దేవరకొండ కెరీర్ లో ఈ సినిమా కూడా ఓ బ్లాక్ బాస్టర్‌ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -