‘మిస్టర్ మజ్ను’ సెన్సార్ పూర్తి..

234
Akhil Akkineni

అఖిల్ అక్కినేని కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘మిస్టర్ మజ్ను’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులను పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ప్రస్తుతం సెన్సార్ బృందం ఏమనుకుంటోంది? ఈ సినిమా ఫలితం ఏంటి? అన్నది తేలే సమయం ఆసన్నమైంది. 24 సాయంత్రం భారీగా ప్రీమియర్లకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. మరో రెండ్రోజుల్లోనే ఫలితం ఏంటో తేలనుంది. అంతవరకూ వేచి చూడాల్సిందే. మరి ఈ మూవీతోనైనా అఖిల్‌ హిట్‌ కొడతాడో లేదో చూడాలి.