అల్లు అర్జున్‌ మూవీలో అవకాశం వచ్చింది కానీ..!

585
Priya Prakash Varrier
- Advertisement -

కన్నుగీటి.. కుర్రకారు మనసులు దోచుకుంది కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. గత ఏడాది ప్రేమికుల రోజున విడుదలైన ఆమె తొలి సినిమా ‘ఒరు అడార్‌ లవ్‌’లోని పాట టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె కన్నుగీటిన తీరుకు సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు. అల్లు అర్జున్‌ ట్విటర్‌ వేదికగా ప్రియ‌ను ప్రత్యేకించి అభినందించారు. ‘ఒరు అడార్‌ లవ్‌’కు ఒమర్‌ లులు దర్శకత్వం వహించారు.

Priya Prakash Varrier

ఈ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్‌ డే’ టైటిల్‌తో ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23న సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ జరగనుంది. అయితే ప్రచారంలో భాగంగా ప్రియా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.. పాటలోని కన్నుగీటిన సీన్‌తోటి ఇంట్లో నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదని తెలిపింది. అల్లు అర్జున్‌ సినిమాలో నటించే ఆఫర్‌ వచ్చింది. కానీ మిస్‌ చేసుకున్నా అని వెల్లడించింది.

Priya Prakash Varrier

ప్రస్తుతం నేను బికాం సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను పెద్ద నటి కావాలన్నది మా నాన్న కల. నా తొలి సినిమా ఒరు అడార్ లవ్. ఇందులో కన్నుగీటిన బామగా నేను పాపులర్ అయ్యాను. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ రావటాన్ని ఎంజాయ్ చేశాను. నాకు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈసినిమా రిలీజ్ కానందుకు ఇంకా ఏ సినిమాకు ఒప్పుకోలేదు. అని ప్రియావారియర్ అంది. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కాబోతోంది’.

- Advertisement -