స్టార్ మాలో అఖండ..ఎప్పుడో తెలుసా!

47
akhanda

నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాస్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌ను అఖండతో మరోసారి నిరూపించారు. బాక్సాఫీస్ వద్ద అఖండ ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతూనే ఉంది. విడుదలై ఐదు వారాలు గడుస్తున్న అఖండ సునామీ ఆగడం లేదు. 2021లో అఖండ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అఖండ విడుదలైన అన్ని ఏరియాల్లోని డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతకు లాభాలను తెచ్చిపెట్టింది. బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా అఖండ నిలిచింది. ఓవర్సీస్‌లో వన్ మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది. అఖండ విజయంతో టాలీవుడ్‌లో కొత్త ఆశలు చిగురించాయి.

అఖండ డిజిటల్ రైట్స్‌ డిస్నీ హాట్ స్టార్ చేతిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే థియేటర్ రన్ క్రమంగా స్లో డౌన్ అవుతుండటంతో ఈ సినిమాను OTTలో రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారట. సంక్రాంతి కానుకగా జనవరి 12 నుంచి అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేశారట. అతి త్వరలో దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు.

అదేవిధంగా అఖండ టెలివిజన్ ప్రిమియర్ విషయంలో కూడా ఓ డేట్ ప్రచారంలోకి వచ్చింది. శాటిలైట్స్ రైట్స్ దక్కించుకున్న స్టార్ మా వారు ఈ ‘అఖండ’ సినిమాను ఫిబ్రవరి 27న ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.