టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన డికాక్..

72
de kock

టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డికాక్. తొలి టెస్టులో విరాట్ సేన సౌతాఫ్రికాపై 113 పరుగుల తేడాతో విజయం సాధించగా ఆ ఓటమి తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నాడు క్వింటన్‌ డికాక్.

టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించాడు.. ఇక, ఆయన రిటైర్మెంట్‌ విషయాన్ని క్రికెట్ సౌత్ ఆఫ్రికా కూడా ధృవీకరించింది. తన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చాడు డికాక్.

ఇది అంత తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదు.. సాషా, నేను మా మొదటి బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతించబోతున్నాం.. నా జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దాని గురించి ఎంతో ఆలోచించా.. నా కుటుంబమే నాకు సర్వస్వం అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.