మోదీపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..

170

దేశమంతట ఎన్నికల వేడి నడుస్తోంది. పలు పార్టీలు ప్రచారలతో హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీపై ఘటుగా విమర్మలు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ భద్రత, ఉగ్రవాదం నిరోధం గురించి ఉపన్యాసాలు చెబుతున్నారని, కాని మాలేగావ్ లో మసీదు సమీపంలో బాంబు పేల్చి ఆరుగురు అమాయకుల ప్రాణాలు బలిగొన్న కేసులో నిందితురాలైన సాధ్వీ ప్రగ్నాకు బీజేపీ టికెట్ ఎలా ఇచ్చారని ప్రధాని మోదీ, బీజేపీ, ఎన్డీఏ, శివసేనలను అసదుద్దీన్ ప్రశ్నించారు.

Akbaruddin Owaisi

ఉగ్రవాద దాడి కేసులో నిందితురాలైన సాధ్వీకి బీజేపీ టికెట్ ఇవ్వడం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం సాగించడమా అని అసద్ ప్రశ్నించారు. ప్రగ్నాఠాకూర్ హేమంత్ కర్కరే గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మహారాష్ట్ర ఓటర్లను ప్రధాని మోదీ ఎలా ఓట్లు అడుగుతారని అసద్ ప్రశ్నించారు. మోదీ మాటలకు, చేతలకు అంతులేనంత అంతరం ఉంటుందని అసదుద్దీన్‌ విమర్శించారు.