బాబుకు బర్త్ డే విషెస్ తెలిపిన కేటీఆర్‌..

199
KTR

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు పలువురు ప్రముఖులు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కేటీఆర్ ట్వీట్.. ‘చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుతున్నా. సమాజ సేవలో మీరు మరెన్నో సంవత్సరాలు గడపాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.