India:అఫ్ఘాన్ రాయబార కార్యాలయం మూసివేత

36
- Advertisement -

న్యూఢిల్లీలోని అఫ్ఘానిస్తాన్ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. భారత ప్రభుత్వం నుంచి మద్ధతు లేకపోవడంతో అఫ్ఘాన్ ప్రజల ప్రయోజనాలను చేకూర్చలేకపోవడం వల్ల అక్టోబర్ 1వతేదీ నుంచి తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

అఫ్ఘాన్, భారత్ దేశాల మధ్య చారిత్రక సంబంధాలు, దీర్ఘకాల భాగస్వామ్యం ఉన్నా తమ రాయబార కార్యాలయాన్ని మూసివేయక తప్పటం లేదని ఆ దేశం తెలిపింది. తమ దేశం పట్ల భారత్ ఆసక్తి చూపించక పోవడం, రాయబార కార్యాలయంలో సిబ్బంది, వనరులను తగ్గించిందని అప్ఘాన్ తెలిపింది.

భారతదేశం ఇంకా తాలిబన్ల సర్కారును గుర్తించలేదు. అప్ఘానిస్థాన్ ప్రజల శ్రేయస్సు కోసం ఈ చర్య తీసుకుంటున్నట్లు ఆ దేశ ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది.

Also Read:స్కంద 2 రోజుల కలెక్షన్ ఎంతంటే..?

- Advertisement -