స్కంద 2 రోజుల కలెక్షన్ ఎంతంటే..?

29
- Advertisement -

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన మాస్ ఎంటర్‌‌టైనర్ స్కంద సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. తొలి రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా రూ. 8.62 కోట్లు రాబట్టింది. రెండో రోజు రూ.3.49 కోట్ల రూపాయలు షేర్ తెచ్చుకుంది. మొత్తంగా రెండ్రోజుల్లో కలిపి ఈ సినిమాకు 12.11 కోట్ల షేర్ లభించింది. వరుస సెలవులు ఉండటంతో కలెక్షన్లు మరింతగా పెరుగుతాయని మేకర్స్ భావిస్తున్నారు.

ఇక ఈ సినిమా మొదటి రోజు కూడా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 18.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అంటే దాదాపు 9 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 15కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో స్కంద కలెక్షన్స్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ గా నిలిచాయి. మొత్తమ్మీద రామ్ పోతినేనికి బోయపాటి శ్రీను మాస్ హిట్ అయితే ఇచ్చాడు.

కానీ, ‘స్కంద‌’ సినిమా రిలీజ్ డేటే కరెక్ట్ గా లేదు. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదే రోజు చంద్రముఖి 2 కూడా రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత రోజు పెదకాపు 1 సినిమా కూడా రిలీజ్ అయ్యింది. దాంతో తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఈ మూడు సినిమాలు కలెక్షన్స్ ను పంచుకోవాల్సి వచ్చింది.

Also Read:అక్కడ ఇల్లు కొనుకున్న జాన్వీ కపూర్

- Advertisement -