మా ఎన్నికల్లో రసాభాస.. శివ బాలాజీ చెయ్యి కొరికిన హేమ..

43

మా ఎన్నికలు రసాభాసగా జరుగుతున్నాయి. పోలింగ్ సెంటర్ వద్ద చిన్న ఘర్షణ జరిగింది. ఇరు ప్యానళ్ల సభ్యులు ఒకరిపై ఒకరు గొడవకు దిగారు. గుర్తు తెలియని వ్యక్తి పోలింగ్ బూత్‌లోకి వచ్చి ప్రకాశ్ రాజ్ ప్యానల్‌కు సంబంధించిన కరపత్రాలను పంచుతుంటే మంచు విష్ణు ప్యానల్ సభ్యులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో శివబాలాజీ చేయిని సీనియర్ నటి హేమ కొరకడం కలకలం రేపింది.

ఈ విషయంపై శివబాలాజీ మాట్లాడుతూ..‘‘నేను బారికేడ్స్ పట్టుకుని ఉంటే వెనుక హేమగారు ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తి వాళ్ల మనిషి కాబట్టి నేను చేయి ఎత్తకూడదని కోపంలో కొరికారు. ఆమె ఏ మూడ్‌లో కొరికారన్నది నేను సరిగ్గా గమనించలేదు. నా ఎడమచేతికి పంటిగాట్లు పడ్డాయి.’’ అని చెప్పారు. ఈ ఘటనపై హేమ స్పందిస్తూ.. శివబాలాజీ చేతులు వేయడం వల్లే తాను కొరికానని చెప్పారు.