ఎవరు గెలిచినా వారికి ప్రోత్సాహం అందిస్తాం- బాల‌కృష్ణ‌

18

మా ఎన్నిక‌ల‌లో చిన్న‌, పెద్ద స్టార్స్ అంద‌రు పోలింగ్ బూత్‌కి వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో నందమూరి నటసింహం బాలకృష్ణ తన ఓటు వేశారు. ఓటు వేసిన త‌ర్వాత మాట్లాడిన బాల‌కృష్ణ‌.. ఎవరు ఇండస్ట్రీకి మేలు చేస్తారో వారికే ఓటేశాను. ఇద్దరూ ఇండస్ట్రీకి బాగా పని చేసేలా కనిపిస్తున్నారు. దీంతో రెండు ప్యానెల్లో ఉన్న వారికి ఓటు వేశాను. ప్రకాశ్‌ రాజ్‌, తమ్ముడు విష్ణు ఇండస్ట్రీకి అన్నదమ్ముళ్ల లాంటి వారే. ఇద్ద‌రు మాటల్లో కాకుండా చేత‌ల్లో చూపిస్తారు. ఎవ‌రు గెలిచినా కూడా మాకు సంతోష‌మే అన్నారు.

రెండు ప్యానల్స్ ఉత్సాహం చూస్తుంటే ఇండస్ట్రీకి మంచి చేసేటట్టు కనిపించారు. ఇరు ప్యానల్స్‌లో ఎవరు మంచి చేస్తారో వారికే ఓటు వేశారు. షూటింగ్స్‌లో అందరం కలిసి కట్టుగా పనిచేసుకుంటాం. ‘మా’ అంతిమలక్ష్యం నటీనటుల సంక్షేమం.. ఎవరు గెలిచినా వారు వెనుక నిలబడి ప్రోత్సాహం అందిస్తాం అని బాలయ్య అన్నారు. కాగా ఈరోజు రాత్రి 8 గంటల తర్వాత అధ్యక్షుడి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.