భావన పెళ్లి ఎవరితో తెలుసా..

119
Actress Bhavana Marriage Confirmed..!

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మలయాళీ భామ.. భావన. ఒంటరి, మహాత్మ లాంటి సినిమాలతో భావన తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.ప్రస్తుతం భావనకు తెలుగు, తమిళభాష్లలో అవకాశాలు లేవు. అయితే మలయాళంలో మాత్రం రెండు సినిమాలు చేస్తోన్నట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ఈ భామకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం చక్కర్లు కొడుతోంది. భావన త్వరలో పెళ్లి పీటలెక్కనుందనే వార్త వినిపిస్తోంది .భావన ఓ మలయాళీ నిర్మాతతో ప్రేమలో పడిందని టాక్.

ఈ విషయాన్ని భావన అంగీకరించారు. అయితే తన ప్రియుడైన ఆ నిర్మాత పేరు మాత్రం చెప్పడానికి నిరాకరించారు. సరైన సమయంలో తన ప్రియుడి పేరును వెల్లడిస్తానని పేర్కొన్నారు. భావన, కన్నడ నిర్మాత డీప్‌గా ప్రేమించుకుంటున్నారట.పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారట. నిజానికి వీరి పెళ్లి ఇప్పటికే జరిగి ఉండాల్సిందని, అయితే నటి భావన తండ్రి ఆ మధ్య మరణించడంతో పెళ్లి వాయిదా పడిందని ఆమె స్నేహితురాళ్ల సమాచారం.

కేరళ రాష్ట్రం,తిరువనంతపురానికి చెందిన భావన పెద్దగా హంగులు, ఆర్భాటాలకు పోకుండా సింపుల్‌గా రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకోనున్నారని కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులే వారి పెళ్లికి అతిథులు కానున్నారని సమాచారం.