నయీం అరాచకాలను అరికట్టాం..

222
KCR on Gangstar Nayeem's encounter
- Advertisement -

నయీం లాంటి సంఘ విద్రోహ శక్తులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నయీం నేరాలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం…నయీం అరాచకాలతో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం….నయీం కేసును తీవ్రంగా పరిగణించిందని తెలిపారు.  ఆగస్టు 8న మిలినియం టౌన్‌ షిప్‌లో మారణాయధాలతో సంచరిస్తున్న నయీం…పోలీసులపై కాల్పులు జరిపాడని తెలిపారు.  పోలీసులు జరిపిన కాల్పుల్లో నయీం మరణించాడని…సంఘటన స్థలంలో ఏకే 47ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

నయీం మరణం అనంతరం సిట్‌తో దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించిందని… ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. నయీం మరణంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని…ప్రభుత్వం తీసుకున్న చర్యను ప్రజలు అమోదిస్తున్నారని తెలిపారు. నయీం కేసులో ఇప్పటివరకు 124 మంది నిందితులను అరెస్ట్ చేశామని.. నయీం అరాచకాలపై 174 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. పోలీసులు జరిపిన సోదాల్లో 21 తుపాకులు, 21 కార్లు, 26 బైకులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.

నయీం కేసులో 741 మంది సాక్షులను విచారించామని తెలిపారు. నయీం నేరాలపై రెండు ఛార్జీషిట్లు నమోదు చేశామని,, మరో 15 ఛార్జీషిట్లు రెడీ అవుతున్నాయని తెలిపారు. నయీం కబ్జాలో ఉన్న 1000 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నయీంను అంతమొందించిన పోలీసుల సమర్థతను అభినందిస్తున్నామని తెలిపారు.

నయీం ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వం తీసుకున్న చర్యను కాంగ్రెస్ పార్టీ సమర్ధిస్తుందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. నయీం సహకరించిన వారు ఏ పార్టీ నేతలైనా, అధికారులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నయీం డైరీని బయటపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. నయీం కేసులో సీబీఐ ఎంక్వైరీ జరిపించాలన్నారు.

- Advertisement -