ఐటీ సోదాలపై స్పందించిన తాప్సీ..

216
Taapsee Pannu
- Advertisement -

తగ కొన్ని రోజులుగా బాలీవుడ్‌ హీరోయిన్‌ తాప్సీ పోన్ను ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐటీ సోదాలపై తాజాగా తాప్సీ నోరు విప్పింది. ఈమేరకు తాప్సీ ట్విట్టర్‌ వేదికగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. పారిస్‌లో నేను కొనుగోలు చేశానని చెబుతున్న బంగళా తాళాల కోసం వెతికారని.. నేను ఇంతకు ముందు తీసుకోని రూ.5 కోట్లకు సంబంధించిన రశీదుల గురించి సోదాలు చేశారని.. అలాగే ఆర్థిక మంత్రి చెబుతున్నట్టు 2013లో నా ఇంటిపై సోదాలు జరిగిన విషయం నాకే గుర్తు లేద అని తాప్సీ ట్వీట్ చేసింది. ఈ సోదాలతో వారికి ఒరిగిందేమీ లేదని పేర్కొంది.

కాగా, తాప్సీతో పాటు దర్శకుడు అనురాగ్ కశ్యప్, మధు మంతెన ఇళ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఫాంటమ్ ఫిలిమ్స్ పన్ను ఎగవేతలకు సంబంధించి అధికారులు ఈ సోదాలు చేశారు. దీనిపై దుమారం రేగడంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పందించారు. 2013లో కూడా వారిపై ఐటీ దాడులు జరిగాయని, అప్పుడు లేని రాద్ధాంతం ఇప్పుడెందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

- Advertisement -