తన ఆఫీసులో పనిచేస్తూ రూ. 45 లక్షలకు పైగా మోసం చేసి సంపాదించిందని హీరో విశాల్ …మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన సంబంధిత మహిళ రమ్య విశాల్‌పై తీవ్ర స్ధాయిలో మండిపడింది.
విశాల్ హీరో రూపంలో ఉన్న పెద్ద విలన్ అని….తన దగ్గర ఉన్న ఆధారాలు భయటపెడితే విశాల్ నిజ స్వరూపం భయటపడుతుందన్నారు. తాను ఎవరిని మోసం చేయలేదని కావాలనే విశాల్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు రమ్య.
ఆరేళ్లుగా తన దగ్గర పనిచేస్తున్న రమ్య అనే మహిళ రూ. 45 లక్షలకు పైగా మోసం చేసి ఇల్ల కొనుక్కుందని చెన్నైలోని వడపాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు విశాల్ మేనేజర్ హరి.
తన సొంత బ్యానర్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం విశాల్ చక్ర అనే సినిమాలో నటిస్తుండగా, ఇటీవల చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో రూపొందుతుండగా సమాజంలో డిజిటల్ అవినీతి , హ్యాకింగ్ అంశాల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.