భారత్‌ బాటలోనే అమెరికా…చైనా యాప్‌లపై నిషేధం!

124
tiktok

భారత్ బాటలోనే పయనించేందుకు సిద్ధమవుతోంది అమెరికా. ఇప్పటికే భారత్‌లో 59 సోషల్ మీడియా యాప్‌లను నిషేధించగా చైనాకు గట్టిషాక్ తగిలింది. ఇక ఇప్పటికే చైనాపై వీలుచిక్కిన్నప్పుడల్లా విమర్శలు గుప్పించే అమెరికా కూడా చైనా యాప్‌లను నిషేధించే పనిలో పడింది.

చైనా యాప్‌ల‌ను నిషేధించాల‌ని భావిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో తెలిపారు. టిక్‌టాక్‌తో స‌హా అన్ని ర‌కాల యాప్‌ల‌ను బ్యాన్ చేయాల‌ని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

ఇక త‌మ దేశంలో చ‌దువుకుంటున్న విదేశీ విద్యార్థుల‌కు అమెరికా షాకిచ్చింది. క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఇప్పుడు కొన్ని విద్యాసంస్థ‌ల్లో ఆన్‌లైన్ క్లాసులు మొద‌ల‌య్యాయి. ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభ‌మైన విద్యార్థులు త‌మ దేశంలో ఉండాల్సిన ప‌నిలేద‌ని అమెరికా పేర్కొన్న‌ది. ఆన్‌లైన్ చ‌దువుల కోసం రిజిస్టర్ చేసుకున్న విద్యార్థుల‌కు వీసాలు ఇవ్వ‌మ‌ని, అలాంటి విద్యార్థుల‌ను యూఎస్ క‌స్ట‌మ్స్ అండ్ బోర్డ‌ర్ ప్రొటెక్ష‌న్ ప‌ర్మిట్ దేశంలోకి రానివ్వ‌ద‌ని ఐసీఈ త‌న ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది.