విశాల్ అయోగ్య ఫస్ట్ లుక్‌…

308
vishal
- Advertisement -

పూరి జగన్నాథ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన టెంపర్‌ సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తన కెరీర్‌లోనే వైవిధ్యమైన పాత్ర చేసిన ఎన్టీఆర్ ప్రేక్షకులను కట్టిపడేశాడు. పోలీస్ ఆఫీసర్‌గా ఎన్టీఆర్‌ పాత్రకు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. టెంపర్‌ పలు భాషల్లో రీమేక్‌ అవుతుండగా తమిళ్‌లో విశాల్‌ హీరోగా చేస్తున్నాడు.

‘అయోగ్య’ టైటిల్ తో ఈ సినిమాను వెంకట్ మోహన్ రూపొందిస్తున్నాడు.ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సినిమా ఫస్టులుక్ విడుదలైంది. పోలీస్ జీప్ కి ఆనుకుని స్టైల్ గా నుంచున్న విశాల్ లుక్ ఆకట్టుకుంటోంది. తమిళనాట మాస్ హీరోగా విశాల్ కి మంచి క్రేజ్ వుంది. ఈ సినిమాలో విశాల్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

 vishal ayogyaఈ చిత్రంలో స‌న్నీ లియోన్ ఐటెం సాంగ్ చేస్తుంద‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌లలో తన ఐటమ్‌ సాంగ్స్‌తో కేక పుట్టిస్తున్న ఈ బాలీవుడ్‌ జాణ తాజాగా మరోసారి కోలీవుడ్‌లో తన ఆట పాటతో దుమ్మురేపడానికి సై అందని టాక్‌.

- Advertisement -