హీరో విశాల్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్

492
hero vishal
- Advertisement -

తమిళ హీరో విశాల్‌కు ఎగ్మూర్ కోర్టు షాకిచ్చింది. టీడీఎస్ సక్రమంగా చెల్లించలేదని నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాల్లో మినహాయించిన పన్ను (టీడీఎస్)ను సక్రమంగా చెల్లించని కేసులో ఈ వారెంట్ జారీ అయింది.

విశాల్‌కు చెందిన విశాల్‌ ఫిలిమ్‌ ఫ్యాక్టరీ కార్యాలయం చెన్నై వడపళనిలో ఉంది. ఐదేళ్లుగా ఇక్కడ పనిచేసే సిబ్బందికి ఇచ్చిన వేతనాల్లో మినహాయించిన పన్ను (టీడీఎస్‌)ను సక్రమంగా ఐటీ శాఖకు చెల్లించలేదని, దానికి వివరణ ఇవ్వాలంటూ విశాల్‌కు గతంలో అధికారులు నోటీసులు పంపారు. అయితే దీనిపై విశాల్‌ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

దీంతో విశాల్‌పై చర్యలు చేపట్టాలంటూ ఎగ్మూరు కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు ఆగస్టు 2న విచారణకు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలంటూ విశాల్‌ను ఆదేశిస్తూ సమను పంపింది. శుక్రవారం విశాల్‌ కోర్టు విచారణకు హాజరు కాలేదు. దీంతో విశాల్‌కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ను జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు.

- Advertisement -